HomeTelugu Trending'దర్బార్‌' రజనీ డబ్బింగ్‌

‘దర్బార్‌’ రజనీ డబ్బింగ్‌

1 181 18
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట’తో అభిమానుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపి ‘దర్బార్‌’తో మరోసారి పలకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, మనోబాలా, సుమన్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌లు తదితరులు నటిస్తున్నారు. ఆదిత్య అరుణాచలం అనే పోలీసు అధికారి పాత్రలో రజనీకాంత్‌ నటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. రెండు రోజులుగా రజనీకాంత్‌ తనకు సంబంధించిన సన్నివేశాలకు డబ్బింగ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేశారు. మరోవైపు సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబరు ఏడో తేదీన నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

అయితే తన పుట్టిన రోజున సాధారణంగా ఏకాంతాన్నే కోరుకుంటారు రజనీకాంత్‌. అందువల్ల ఆ రోజున ఆడియో వేడుక ఉండకపోవచ్చని తెలుస్తోంది. విజయకాంత్‌ హీరోగా నటించిన ‘రమణ’ చిత్రం వచ్చినప్పటి నుంచే ఏఆర్‌ మురుగదాస్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం సూపర్‌స్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకాలానికి వారి ఎదురుచూపు నెరవేరుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu