HomeTelugu Trending'బ్రో' థీమ్‌ సాంగ్‌ విడుదల

‘బ్రో’ థీమ్‌ సాంగ్‌ విడుదల

Zero cuts for Pawan Kalyans Bro

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ – సాయితేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సముద్రఖని దర్శకత్వం వహించాడు. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు సమకూర్చడం విశేషం.

ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి, థీమ్ ఆఫ్ ‘బ్రో’ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కి తగినట్టుగా, పవన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది.

తమన్ సంగీతం అందించిన ఈ పాటకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. ‘బ్రో’ టైటిల్ ను లింక్ చేస్తూ పాటను రాసిన తీరు బాగుంది. తమన్ స్వరపరిచిన బీట్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్డేట్స్‌ ఈ సినిమాపై మంచి హైప్స్‌ని క్రియేట్‌ చేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu