HomeTelugu Big Storiesతన బస్సు కండక్టర్‌గా చేసిన డిపోకి వెళ్లిన రజనీకాంత్‌

తన బస్సు కండక్టర్‌గా చేసిన డిపోకి వెళ్లిన రజనీకాంత్‌

rajinikanth visits bmtc dep

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. రూ.600 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. రజనీకాంత్ ఎప్పుడూ.. నిరాడంబరంగా గడుపుతుంటారు. తన మూలాలను ఎన్నడూ మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తాను గతంలో పని చేసిన సంస్థను సందర్శించారు రజనీకాంత్.

సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌‌గా పని చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోలో ఆయన పని చేసేవారు. ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. వారితో రజనీకాంత్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu