క్రిష్ తో సెట్స్ పైకి వెంకీ!

‘గురు’ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండడంతో వెంకటేష్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో వెంకటేష్ నెక్స్ట్ సినిమా పూరీ జగన్నాథ్ లేదా క్రిష్ లతో ఉండొచ్చనే మాటలు వినిపించాయి. అయితే గత కొన్ని రోజులుగా వెంకీ, పూరీ కథకు ఓకే చెప్పినట్లు.. 45 కోట్ల బడ్జెట్ తో సినిమా ఉంటుందని ఇలా రకరకలుగా వార్తలు వినిపించాయి. అయితే వెంకీ మాత్రం ముందుగా క్రిష్ తోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు టాక్.

అసలు విషయంలోకి వస్తే.. పూరీ జగన్నాథ్ చెప్పిన బడ్జెట్ ఎక్కువవుతుందనే అభిప్రాయంతో సురేశ్ బాబు ఉన్నాడు. ఇదే విషయమై వెంకటేష్ తో చర్చలు జరిపారు. ఇంకా బడ్జెట్ విషయంలో ఎలాంటి అభిప్రాయానికి రాలేదు. పైగా పూరీ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనను నమ్మి అంత బడ్జెట్ ను ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తున్నారు. అందుకే మొదటగా వెంకీ అనుకున్నట్లుగా క్రిష్ తో సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు చెబుతున్నారు.