‘సప్తసాగరాలు దాటి’ ట్రైలర్ లాంచ్‌ చేసిన నాని

టాలెంటెడ్ యాక్టర్ కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి నటించిన తాజా చిత్రం ‘సప్త సాగరాలు దాటి’. ఈ చిత్రానికి హేమంత్‌ ఎం రావు డైరెక్టర్. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను నేచురల్ స్టార్‌ నాని డిజిటల్‌గా లాంచ్ చేశాడు.

హీరోయిన్ తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణలతో ట్రైలర్ మొదలయింది. అనుకోని కారణాల వల్ల హీరో జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.

ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలే ఉంది. నీకెప్పుడూ చెప్పలేదు కానీ నా సముద్రానివి నువ్వు అంటూ హీరోయిన్‌ చెబుతున్న మాటలు ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి.

మొన్న ఎంతమంచి కల వచ్చిందో తెలుసా. మా ఊరిలో సముద్రం ఉంది కదా.. నిన్ను అక్కడికి తీసుకెళ్లాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరు కూడా లేరు. ఆ బీచ్‌లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం అంటూ సాగుతుంది.

ఛైత్ర జే అచర్‌ అచ్యుత్ కుమార్‌, పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సెప్టెంబర్ 22న విడుదల చేస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates