HomeTelugu Big Storiesస్టార్‌ హీరోకి చెల్లిగా రకుల్‌?

స్టార్‌ హీరోకి చెల్లిగా రకుల్‌?

Rakul Preet Singh as sisterరకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఒక పక్క ఆమె పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22 గోవాలో ఆమె పెళ్లి జరుగునుంది. మరో పక్క ఒక బిగ్‌ ప్రొజెక్ట్‌లో ఆమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే టాలీవుడ్‌లో ఆమెకు ఛాన్స్‌లు పెద్దగా లేవు. దీంతో ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. తాజాగా సంక్రాంతికి రిలీజైన ఆయలాన్ లో శివ కార్తికేయన్ కు జోడిగా నటించింది. తాజాగా ఈ బ్యూటీకి ప్యాన్ ఇండియా మూవీలో రిస్కీ పాత్ర ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కించనున్న ‘రామాయణం’ లో నటీనటుల ఎంపిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాముడిగా రన్బీర్ కపూర్ ఎంపికైయ్యాడు. సీతగా సాయిపల్లవి ని అనుకున్నారు. కానీ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్‌, కైకేయిగా లారా దత్త, విభీషణుడిగా విజయ్ సేతుపతిలను తీసుకున్నారు అని తెలుస్తుంది. ఈక్రమంలో రావణాసురుడి చెల్లి శూర్ఫణఖ కోసం రకుల్‌ను సంప్రదించిన్నట్లు వినికిడి.

మరి ఈ పాత్రకు రకుల్‌ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. నటీనటులకు సంబంధించి అన్ని పేర్లు ఫైనల్ అయిన తరువాత ఒక ప్రెస్ మీట్ ద్వారా నితేష్ తివారి వాటిని వెల్లడిస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!