మన్మధుడితో రకుల్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళంలో వరసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో అవకాశాలు వస్తున్నట్టే వస్తు చేజారి పోతున్నాయి. వెంకిమామలో అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ షేర్ అవుతున్నది. అదేమంటే.. నాగార్జున చేస్తున్న మన్మధుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుందనే న్యూస్ షేర్ అవుతున్నది.

రకుల్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ లు మంచి స్నేహితులు. ఈ స్నేహం కారణంగానే నాగార్జున మన్మధుడు 2 లో అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో ప్రారంభం కాబోతున్నది. తాజా సమాచారం ప్రకారం ఇది మన్మధుడు సినిమాకు సీక్వెల్ కాదని, ఈ సినిమా టోటల్ డిఫరెంట్ అని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.