సల్మాన్‌ ఖాన్‌ తో ఉపాసన ఇంటర్వ్యూ

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ సతీమణి, మెగా కోడలిగానే కాకుండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో గ్రూప్‌కు చెందిన బిపాజిటివ్‌ మేగజైన్‌ వ్యవహరాలను ఉపాసన పర్యవేక్షిస్తున్నారు. పాఠకులను ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి హెల్త్‌ సీక్రెట్స్‌, డైట్‌ ప్లాన్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులకు తెలియజేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం భారత్‌ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సల్మాన్‌ మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఉపాసనకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు.

ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోతో పాటు ‘భాయ్ అంటే ఇది. మీ సీక్రెట్స్‌ మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు ఉపాసన.