HomeTelugu Trendingనితిన్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

నితిన్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

5 27
హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా నితిన్ సెట్ చేసి పెట్టుకున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఆ మధ్య వరుస పరాజయాలు పలకరించడంతో, రకుల్ వెనుకబడిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె, ఒక్కసారిగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే నితిన్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారట. ఇప్పుడున్న పరిస్థిలు బట్టి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu