HomeTelugu Trending'పుష్ప' మూవీ అప్డేట్‌

‘పుష్ప’ మూవీ అప్డేట్‌

Fourth Song From Pushpa

సుకుమార్‌ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాట రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది చిత్రబృందం. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ సాగే ఈ పాట న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది మూవీ యూనిట్‌.

ఈ పోస్ట‌ర్‌లో బ‌న్నీ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతుంది.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu