HomeTelugu Big Storiesమహేష్‌-రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌

మహేష్‌-రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌

Ram chara1

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న బంగార్రాజు, ఆర్‌ఆర్‌ఆర్, భీమ్లా నాయక్ సినిమాలు మల్టీస్టారర్సే. ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు. తాజాగా మరో మల్టీస్టారర్ కూడా తెలుగు ఇండస్ట్రీలో రాబోతుందని తెలుస్తోంది.

Ram charan and mahesh babu

రామ్ చరణ్, మహేశ్‌ బాబు హీరోలుగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ ఒక భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ దగ్గర మహేశ్‌ బాబు డేట్స్ ఉన్నాయి. అల్లు అరవింద్‌ డేట్స్ అడిగితే అల్లుడు రామ్ చరణ్ కాదనడు. ఇద్దరి కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో మహేశ్‌ బాబుతో మహర్షి.. రామ్ చరణ్ తో ఎవడు సినిమాలు తెరకెక్కించాడు వంశీ. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరోవైపు తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్ కూడా ఈ సూపర్ స్టార్స్ ఇద్దరినీ కలిపి సినిమా చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ వర్కవుట్ అయినా కూడా అభిమానులకు పండగే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu