బాహుబలి పెళ్ళికి రెడీ!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరనగానే గుర్తొచ్చేది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ముప్పై ఏడు ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికీ తన పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదు ఈ హీరో. దీంతో ఇప్పుడు ప్రభాస్ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తన పెదనాన్న కృష్ణంరాజు వెల్లడించారు. ‘బాహుబలి 2 సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ కు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. తను కూడా మా మాట కాదనడనే నమ్మకం ఉంది. తన నెక్స్ట్ సినిమా మొదలవ్వక మునుపే పెళ్లి చేయాలనుకుంటున్నాం’ అన్నారు.
అయితే పెళ్లి కూతురు ఎవరు, పెళ్లి ఎక్కడ జరుగుతుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. బాహుబలి 2 రిలీజ్ వరకు ఎదురుచూడండని అంటున్నారు. కానీ ప్రభాస్ తన తల్లికి నచ్చిన అమ్మాయినే వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. పెళ్లికూతురు కూడా గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాహుబలి వివాహానికి రెడీ అయిపోతున్నాడు!
 
 
Attachments area