HomeTelugu Trending'ఏక్‌ మినీ కథ'కు రామ్‌ చరణ్‌ విషెస్‌

‘ఏక్‌ మినీ కథ’కు రామ్‌ చరణ్‌ విషెస్‌

Ram charan Best Wishes to

టాలీవుడ్‌ యువ నటుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ సినిమాని డిజిటల్ రిలీజ్ కు రెడీ చేశారు. కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘ఏక్ మినీ కథ’ టీమ్ కు విషెస్ తెలియజేశారు. ‘ఈ సినిమా ప్రత్యేకమైనదిగా కనిపిస్తున్నది. మూవీ యూనిట్ నిజాయితీతో చేసిన అటెంప్ట్ అని అర్థం అవుతోంది. టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్. మే 27న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న ‘ఏక్ మినీ కథ’ను తప్పకుండా చూడండి” అంటూ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథను అందించడం గమనార్హం. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని కృష్ణ మురళి, హర్షవర్ధన్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా.. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu