HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌ నుండి రామ్‌చరణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది

ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి రామ్‌చరణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది

look release from RRR
టాలీవుడ్‌ స్టార్‌ హీరో మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ రేపు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్‌కు అదిరిపోయే పుట్టినరోజు కానుకగాను అందజేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుథిరం) . ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా హాలీవుడ్‌ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ స్టార్‌ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది.

కాగా ఇప్పటికే విడుదలైన.. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ టీజర్లు ప్రేక్షకులను విపరీతం ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu