టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీకి ఎంత ప్రముఖ్యత ఇస్తారో తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్-నమ్రత దంపతులకు మంచి క్రేజ్ ఉంది. కాగా ఈ రోజు మహేష్, నమ్రతల పెళ్లి రోజు. ఈ సందర్భంగా నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ ను ప్రేమగా ముద్దాడుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసిన నమ్రత స్వీట్ విషెస్ తెలిపారు. “వివాహం తరువాత 16 సంవత్సరాలు ఎంతో వేగంగా గడిచాయి. బలమైన ప్రేమతో పాటు నమ్మకాల కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే” అని పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
CLICK HERE!! For the aha Latest Updates