HomeTelugu Big Storiesత్వరలోనే సెట్ లో కలుసుకుందాం : రామ్‌ చరణ్‌

త్వరలోనే సెట్ లో కలుసుకుందాం : రామ్‌ చరణ్‌

ramcharan 1

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెర సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయమైయ్యాడు. తన మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు.

కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. ఈ రోజు బుచ్చిబాబు పుట్టిన రోజు.. ఈ సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ బుచ్చిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

త్వరలోనే సెట్ లో కలుసుకుందామంటూ క్యాప్షన్ ఇచ్చాడు. బుచ్చిబాబు – రాంచరణ్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ శంకర్ తో RC15 లో నటిస్తున్నాడు. అయితే శంకర్‌ ‘భారతీయుడు 2’ సినిమాలో బిజీగా ఉన్నాడు.

అయితే RC15 తో పాటు బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడంట. ఈ సమ్మర్ తర్వాత బుచ్చిబాబుతో రామ్‌చరణ్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

బుచ్చిబాబు తన రెండో సినిమా ఎన్టీఆర్ తో చేయాలని చాలా కలలు కన్నాడు. వేరే హీరోలు నిర్మాతలు బుచ్చిబాబుతో మూవీ చేయాలని ఇంట్రెస్ట్ చూపించినా తాను మాత్రం ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు.

అయితే ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ చాలా లేటుగా పట్టాలెక్కడంతో బుచ్చిబాబు రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపించాయి.

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌తో రామ్‌ చరణ్‌ డాన్స్‌.. వైరల్‌

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu