‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం‌. అయితే ఈ ఫంక్షన్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అనుకుంటున్నారట. మహేష్‌తో రామ్‌చరణ్‌కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఈవెంట్‌కు అతడినే ఆహ్వానించాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కూడా ఈ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో దాదాపు దశాబ్దం తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates