HomeTelugu Big Storiesవెబ్‌ సీరిస్‌లో రామ్‌ చరణ్‌ ఎంట్రీ..

వెబ్‌ సీరిస్‌లో రామ్‌ చరణ్‌ ఎంట్రీ..

8 3
డిజిట‌ల్ ఫ్లాట్ ఫాంకు రోజురోజుకు డిమోండ్‌ పెరుగుతున్న నేపధ్యంలో.. స్టార్‌ హీరో, హీరోయిన్‌లు కూడా అటు వైపు అడుగులేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి స్టార్ హీరోయిన్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్ కూడా అడుగుపెట్ట‌బోతున్నాడు. అయితే న‌టుడిగా కాకుండా నిర్మాత‌గా రాంచ‌ర‌ణ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు సమాచారం.

ఇప్ప‌టికే నిర్మాత‌గా, హీరోగా దూసుకుపోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇక వెబ్ సిరీస్‌లో కూడా త‌న స‌త్తా చాట‌బోతున్నాడు. భారీ బ‌డ్జెట్ తో మంచి క‌థ‌ల‌తో వెబ్ సిరీస్ తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ట‌. అయితే.. ఇందులో కూడా మెగాస్టార్ కీ రోల్స్ ప్లే చేస్తారా…? ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లా ర‌న్ చేస్తారా అన్న‌ది మాత్రం క్లారిటీ రాలేదు. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu