ప్రభాస్ హీరోయిన్ పై నెటిజన్లు ఫైర్!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియాను హ్యాండిల్ చేయడం కాస్త కష్టంగా మారింది. ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టడం నెటిజన్లతో తిట్టించుకోవడం ఇదే తంతు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ మద్య విద్యాబాలన్ తన పర్సనాలిటీ గురించి సమర్థించుకుంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో ఆమెకు మద్దతుగా శ్రద్ధా కపూర్ అలనాటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోను పోస్టు చేస్తూ… ‘ఆమె పొట్టటోన్డ్ కాదని, ఆ శరీరం బిగుతుగా ఉండదని, అయినా ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణతో పాటు శృంగార దేవతగా నీరాజనాలు అందుకుందని గుర్తు చేస్తూ…శరీర సౌష్టవం అనేది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంద’ని తెలుపుతూ ఫోటో పోస్టు చేసింది. 

దీనిపై ఇప్పుడు నెటిజన్లు శ్రద్ధా కపూర్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి శరీరం వారి ఇష్టం అన్నపుడు ‘స్లిమ్  గా ఉండండి.. స్లిమ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ గ్రీన్ టీ తాగండి అని ఎందుకు చెబుతున్నావు? డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా?..హిపోక్రైట్’ అంటూ నిలదీస్తున్నారు