HomeTelugu Big Storiesచిరంజీవి 'ఆచార్య' నుండి రామ్‌చరణ్‌ లుక్‌ రిలీజ్‌

చిరంజీవి ‘ఆచార్య’ నుండి రామ్‌చరణ్‌ లుక్‌ రిలీజ్‌

Ram charan first look from
మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ కీలక ప్రాతలో నటిస్తున్నట్లు కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీన్ని క‌న్ఫార్మ్ చేస్తూ.. ఈ పాత్రకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. రామ్ చరణ్ ఎన్న‌డూ లేని విధంగా కొత్త లుక్‌లో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో క‌న‌ప‌డుతున్నాడు.

సిద్ధా అనే పాత్రలో ఆయ‌న న‌టిస్తున్నాడ‌ని ఈ సినిమా బృందం తెలిపింది. ‘ఆచార్య’ సెట్‌లోకి ఆయ‌న‌కు స్వాగతం పలుకుతున్నామ‌ని చెప్పింది. “మా సిద్ధా సర్వం సిద్ధం” అంటూ ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఈ పోస్ట‌ర్ ను పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ న‌టిస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu