నా ట్రైనర్, డైటీషియన్ రెండూ చరణే!

దాదాపు పదేళ్ళ సుధీర్ఘ విరామం తరువాత చిరంజీవి తన 150వ సినిమాతో సందడి చేయనున్నారు. ఈ సంధర్భంగా.. చిరు అభిమానులు అడగాలనుకునే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారు.
చాలా గ్యాప్ తరువాత వస్తున్నాననే టెన్షన్ మీలో ఏమైనా ఉందా..?
వంద సినిమాలు చేసినా.. నూట యాభై సినిమాలు చేసినా.. కాంపిటీషన్ ఉన్నప్పుడూ చిన్న స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ మీద చాలా నమ్మకం ఉంది.
యంగ్ గా మారడానికి తీసుకున్న స్పెషల్ డైట్ ఏంటి..?
నా ట్రైనర్, డైటీషియన్ రెండూ చరణే.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి.. ఇలా ప్రతి విషయంలో తనే కేర్ తీసుకున్నాడు.
నాగబాబు గారు అలా కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా..?
తను హర్ట్ అయ్యాడు.. రియాక్ట్ అయ్యాడు. నేనైతే అలాంటి కామెంట్స్ కు రియాక్ట్ అవ్వను. మనం రియాక్ట్ అయితే వారు చేసిన కామెంట్స్ కు అటెన్షన్ పెరిగిపోతుంది. రియాక్ట్ కాకపోతేనే బెటర్.
మీ వీణ స్టెప్ ఏమైనా సినిమా ఉంటుందా..?
అదే స్టెప్ ను కాస్త కొత్తగా లారెన్స్ నాతో చేయించాడు.
వినాయక్ గారు ఎవరి ఛాయిస్..?
నిర్మాత ఛాయిస్. నా మైండ్ లో కూడా అదే ఉంది.
ఈ సినిమాలో మెగాహీరోలు ఎవరు కనిపిస్తున్నారు..?
చరణ్ ఒక పాటలో కనిపిస్తాడు. అలానే టైటిల్స్ లో అల్లు అర్జున్ కనిపిస్తాడు.
మెగా మల్టీస్టారర్ ఎప్పుడు ఉంటుంది..?
దేనికైనా సమయం రావాలి.
రాజకీయంగా పార్టీ మార్చే అవకాశాలు ఉన్నాయా..?
ఛాన్స్ లేదు..
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఏం అంటారు..?
ప్రతి ఒక్కరికీ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఉండాలి. వేరొకరిని బాధ పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఇంట్లోనే చాలా కాంపిటీషన్ ఉన్నట్లు ఉంది..?
ఏ పోటీ అయినా.. అందమైనదే..
మీ ఫ్యామిలీలో ఉన్న నటుల గురించి చెప్పాలంటే.. ?
రామ్ చరణ్-గుమ్మలంగా ఉండే వ్యక్తి
అల్లు అర్జున్-ఆకతాయితనం
వరుణ్ తేజ్-నిలకడ
సాయి ధరం తేజ్-హుషారు
నీహారిక-సున్నితత్వం