HomeTelugu Trendingరామ్‌చరణ్‌పై సమంత ప్రశంసలు

రామ్‌చరణ్‌పై సమంత ప్రశంసలు

9 16
మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ ఇటీవల వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారిన సంగతి తెలిసిందే. వన్యప్రాణి సంరక్షణకు ప్రపంచస్థాయి నిధుల సమీకరణలో చెర్రీ భాగమయ్యారనే విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే వన్యప్రాణుల మీద ఉన్న ప్రేమతో తన ఇంట్లో ‘వైల్డెస్ట్‌ డ్రీమ్స్‌’ పేరుతో ఓ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ చూసేందుకు పలువురు సెలబ్రిటీలు వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పలువురు తారలు షేర్‌ చేశారు. తాజాగా రామ్‌చరణ్‌పై సామ్‌ ప్రశంసలు కురిపించారు

ఎగ్జిబిషన్‌కు వచ్చిన సమంత.. రామ్‌చరణ్‌ తీసిన పలు వైల్డ్‌ లైఫ్‌ ఫొటోలు బాగున్నాయని మెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌ దంపతులతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. దీనితోపాటు రామ్‌చరణ్‌ తీసిన పలు ఫొటోలను కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సమంత షేర్ చేశారు. ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీతో అద్భుతమైన సాయంత్రాన్ని మాకందించిన రామ్‌చరణ్‌, ఉపాసనకు ధన్యవాదాలు. చరణ్‌ .. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది.’ అని సమంత ప్రశంసించారు. మరోవైపు మంచు లక్ష్మి సైతం.. రామ్‌చరణ్‌తో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా చేస్తూ.. ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ కోసం ఫండ్‌ రైజ్‌ చేసిన మొదటి వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ రామ్‌చరణ్‌. చెర్రీలోని కొన్ని వినూత్నమైన టాలెంట్లను చూడడం చాలా అద్భుతంగా ఉంది. చెర్రీని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. అభినందనలు’ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu