HomeTelugu Trending'ఆచార్య' షూటింగ్‌లో రామ్‌ చరణ్‌

‘ఆచార్య’ షూటింగ్‌లో రామ్‌ చరణ్‌

Ram Charan in Acharya sho
కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆచార్యలో రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఆచార్య సెట్‌లో రామ్ చరణ్ అడుగుపెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో దర్శకుడు కొరటాలతో కలిసి ఆయన టీ తాగుతూ ఉన్నాడు. ఈ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చాడా? అన్న విషయం తెలియరాలేదు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu