వ్యాక్సిన్‌ తీసుకున్న బాలీవుడ్‌ నటుడికి కరోనా!


బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా ఆయనకు వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా సోకింది. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.

వాస్తవానికి మార్చి 9నే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న ఫొటోను కూడా ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘వీ అంటే వ్యాక్సిన్స్! కరోనా సంక్షోభ సమయంలో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ముందు వరుస యోధులైన ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులకు ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోడికి కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. టీకా తీసుకుని మూడు వారాలు కాకముందే ఆయనకు కరోనా సోకింది.

CLICK HERE!! For the aha Latest Updates