HomeTelugu Trending'వీరయ్య విజయ విహారం'లో రామ్‌చరణ్‌

‘వీరయ్య విజయ విహారం’లో రామ్‌చరణ్‌

Ram Charan in waltair veera
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను రేపు హనుమకొండలో నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది.

ఈ వేడకకు రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఈ వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరుకానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ వేడుకకు రామ్ చరణ్ కానుండడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా .. ప్రకాశ్ రాజ్ విలన్‌ పాత్రలో కనిపించాడు. ఒక కీలకమైన పాత్రను రవితేజ పోషించాడు.

20230127fr63d3979e3ba99

Recent Articles English

Gallery

Recent Articles Telugu