HomeTelugu Trendingరామ్‌చరణ్‌ ఆరోగ్యం బాగుంది.. వదంతులపై చిత్రం బృందం స్పందన

రామ్‌చరణ్‌ ఆరోగ్యం బాగుంది.. వదంతులపై చిత్రం బృందం స్పందన

10 20మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఆరోగ్యం బాగుందని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన మరోసారి గాయపడ్డారని మంగళవారం పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. ఓ సన్నివేశం సాధన చేస్తున్న క్రమంలో చెర్రీ ప్రమాదవశాత్తు వెనక్కిపడ్డారని, దీంతో స్వల్పగాయమైందని వదంతులు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని చిత్ర వర్గాలు తేల్చి చెప్పాయి. చెర్రీ ఆరోగ్య పరిస్థితి బాగుందని వెల్లడించాయి. ఆయన సోమవారం, మంగళవారం షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపాయి. కొన్ని రోజుల క్రితం చరణ్‌ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న చెర్రీ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu