HomeTelugu Trendingవిక్రమ్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్

విక్రమ్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్

Vikram's Trailer To Be Launched Tomorrow

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కలిసి నటించిన చిత్రం ‘విక్రమ్‌’. ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

తాజాగా ఇప్పుడు తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. రామ్ చరణ్ ఈ ట్రైనర్ ను లాంచ్ చేశారు.యాక్షన్ సీన్స్, అదిరిపోయే డైలాగులుతో రెడీ అయ్యిన ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.ఈ ట్రైలర్‌లో కమల్, విజయ్, ఫాహద్‌ ఫాజిల్‌ ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు.. ప్రతి ఒక్క సీన్‌ అద్భుతంగా యాక్షన్‌తో నిండిపోయింది. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. ముగ్గురు విలక్షణ నటులతోపాటు సూర్య అతిథి పాత్రలో నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu