HomeTelugu Newsదీపావళి కానుకగా రామ్‌చరణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌

దీపావళి కానుకగా రామ్‌చరణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌

మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లుక్‌లో చరణ్‌ మాస్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కైరా అద్వానీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది.

2 5

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. తెలుగు హీరో ఆర్యన్‌ రాజేష్‌లు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.

Ram%20Charan%20Titler

Recent Articles English

Gallery

Recent Articles Telugu