HomeTelugu Trendingనాని దర్శకుడితో రామ్‌ చరణ్‌ సినిమా!

నాని దర్శకుడితో రామ్‌ చరణ్‌ సినిమా!

Ram Charan movie with Nani
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బీజీగా ఉన్నాడు. దాంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్‌ లో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్ర చేయనున్నాడు. తాజాగా రామ్‌చరణ్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చెర్రీ తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాట్లు వినికిడి. గౌతమ్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట, ప్రస్తుతం కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. దీనిలో ఎంత నిజం ఉందో అధికారీకంగా ప్రకటించే వరుకు ఎదురుచూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu