విలన్‌గా రామ్ చ‌ర‌ణ్.. అభిమానులు ఒప్పుకుంటారా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం త‌ర్వాత న‌టించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ‘RRR’ సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా ఉండ‌టంతో ఆయ‌న‌కు పోటీగా పోటెత్తుతున్నాడు చెర్రి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజ‌మౌళి కూడా రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌పై చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు

ముఖ్యంగా ఇందులో చ‌ర‌ణ్ ఒక‌టి రెండు కాదు ఏకంగా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే కానీ నిజ‌మైతే అభిమానుల‌కు అంతకంటే పండ‌గ మ‌రోటి ఉండ‌దు. మెగా వార‌సున్ని పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాల‌నేది మెగా అభిమానుల ఆశ కూడా. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా కాస్త నెగిటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నాడని చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రామ‌రాజు అనే బ్రిటీష్ పోలీస్ ఆఫీస‌ర్ గా.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా.. నేటిత‌రం మాస్ హీరోగా మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తోనే రెండో షెడ్యూల్ ను పూర్తి చేయ‌నున్నాడు రాజ‌మౌళి. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత మూడో షెడ్యూల్ మొద‌లు కానుంది. న్యూ లుక్ కోసం ఎన్టీఆర్‌ అక్క‌డికి వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates