HomeTelugu Trendingధర్మస్థలి ద్వారం తెరుచుకుంది.. ఆచార్య అప్డేట్‌

ధర్మస్థలి ద్వారం తెరుచుకుంది.. ఆచార్య అప్డేట్‌

Ram charan new look from Ac

‘ఆచార్య’ చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా లోరామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. అభిమానుల కోసం నిర్మాణ సంస్థ చరణ్‌ కొత్తలుక్‌ విడుదల చేసింది. ‘ధర్మస్థలి(ఆలయ సెట్‌)కి ద్వారం తెరుచుకుంది. చివరి షెడ్యూల్‌లో ఉన్నాం’ అంటూ అందులో పేర్కొంది. అంతేకాదు త్వరలోనే మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతోందని ప్రకటించింది.

కరోనా ఉద్ధృతి వల్ల వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది. త్వరలోనే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయనున్నారు. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu