HomeTelugu Newsరామ్ చరణ్ యాక్షన్‌ ఫొటోస్ వైరల్‌

రామ్ చరణ్ యాక్షన్‌ ఫొటోస్ వైరల్‌

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అజర్ బైజాన్ షూటింగ్ ను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీమ్.. వైజాగ్ లో భారీ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణ పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

charan rc 12 pic

వైజాగ్ లో ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. చరణ్ రఫ్ లుక్ లో, చేతిలో వింతగా ఉన్న ఆయుధాన్ని పట్టుకొని రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. భారీ యాక్షన్ ఫైట్ గా దీనిని చిత్రీకరిస్తున్నారట. రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ నటిస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu