‘అరవింద సమేత’లో మరో సర్ప్రైజ్

జూనియర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అరవింద సమేత’. ఈ సినిమా ఆడియో ఈనెల 20 వ తేదీన రిలీజ్ అయింది. నాలుగు పాటలతో కూడిన ఈ ఆడియో సూపర్ హిట్ అయింది. ఈ నాలుగు సాంగ్స్ లో ఒకటి మాత్రమే రొమాంటిక్ సాంగ్. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్ ఒక్కటే ఉండటంతో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది.

అయితే అభిమానుల కోసం ఇప్పుడు థమన్ మరో సాంగ్ ను రెడీ చేస్తున్నాడు. మాములుగా ఈ ఆడియోలో ఐదు సాంగ్స్ ఉన్నాయట. సమయం లేకపోవడంతో నాలుగు మాత్రమే రెడీ చేశారు. మరో సాంగ్ ను థమన్ ఇప్పటికే ట్యూన్ చేసినట్టుగా సమాచారం. అందమైన లొకేషన్ల్స్ లో దీనిని షూట్ చేసి.. సినిమా రిలీజ్ తరువాత ఈ సాంగ్ ను యాడ్ చేస్తారని అంటున్నారు. అయితే థమన్ ఐదో సాంగ్ తో అభిమానుల కు సర్ప్రైజ్ చేయబోతున్నాడు.