HomeTelugu News'ఆర్‌ఆర్‌ఆర్‌' మార్నింగ్​ షూట్ వీడియో షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్నింగ్​ షూట్ వీడియో షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌

11 7టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇటు చెర్రీ అభిమానులు, అటు తారక్‌ అభిమానులు ఇద్దరూ ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కీలక సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్లిన చిత్ర బృందం తిరిగొచ్చింది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ స్వయంగా వెల్లడించారు.

రామ్‌చరణ్‌ కారులో వెళ్తూ.. ‘రామోజీ ఫిల్మ్​సిటీలో ఉదయం షూటింగ్‌లకు రావడం ఎంతో బాగుంటుంది. మార్నింగ్​ షూట్​ను నేను ఎంతో ఆస్వాదిస్తాను. లవ్‌ యూ’ అంటూ వీడియోను పంచుకున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారు. షూటింగ్‌ ప్రారంభమై కొన్ని నెలలు కావొస్తున్నా, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయలేదు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు హీరోయిన్‌ను అన్వేషించే పనిలో ఉంది చిత్ర బృందం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!