రివ్యూ: చెలియా

నటీనటులు: కార్తీ, అదితి రావు
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: మణిరత్నం
కార్తీ, అదితిరావు జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చెలియా’. చాలా కాలం తరువాత మణిరత్నం స్టాండర్డ్స్ లో వస్తోన్న సినిమా అనే బజ్ ను ఈ సినిమాతో క్రియేట్ చేశారు. మరి ఈ సినిమా మణిరత్నం మ్యాజిక్ ను రిపీట్ చేసిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
వరుణ్(కార్తీ) కాశ్మీర్ లో ఫైటర్ పైలట్ గా బాధ్యతలు నిరవహిస్తూ ఉంటాడు. అదే ప్రాంతానికి లీలా(అదితిరావు) అనే అమ్మాయి డాక్టర్ గా పని చేయడానికి వస్తుంది. వరుణ్ కు ఓసారి యాక్సిడెంట్ కావడంతో లీలా ఉండే హాస్పిటల్ లోనే చేర్పిస్తారు. వరుణ్ ఎప్పుడైతే లీలాను చూస్తాడో.. అప్పటినుండే తనను ఇష్టపడతాడు. కొన్ని రోజులకి లీలా కూడా వరుణ్ ను ఇష్టపడుతుంది.
ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటారు. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి వరుణ్ పెళ్లి, పిల్లల బాధ్యతను తీసుకోవడానికి వెనుకడుగు వేస్తాడు. దీంతో లీలా అతడి నుండి దూరంగా వెళ్లిపోతుంది. అదే సమయంలో వరుణ్ కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీకు పట్టుబడతాడు. మరి అక్కడ నుండి వరుణ్ తప్పించుకున్నాడా..? లీలాను మరోసారి కలిశాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
మణిరత్నం మేకింగ్
సినిమాటోగ్రఫీ
సంగీతం
కార్తీ, అదితిరావు

మైనస్ పాయింట్స్:
స్లో గా సాగే సెకండ్ హాఫ్

విశ్లేషణ:
ఓ అందమైన ప్రేమకథను సినిమాగా చేయడంలో మణిరత్నం తరువాతే ఎవరైనా.. చెలియా సినిమాతో మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు ఈ లెజండరీ డైరెక్టర్. చక్కటి రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేసి యూత్ అందరికీ దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. సినిమా మొదటి భాగం ఆసక్తిగా సాగినప్పటికీ రెండో భాగం కాస్త స్లో గా నడిచింది.

కార్తీ తన పాత్రలో ఇమిడిపోయాడు. కొత్త లుక్ తో కనిపించాడు. పాకిస్థాన్ జైలు నుండి తప్పించుకునే సన్నివేశాల్లో కార్తీ అధ్బుత నటన ప్రదర్శించాడు. అలానే అదితితో కాంబినేషన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. అదితిరావుకి ఈ సినిమాతో దక్షిణాదిన మంచి ఎంట్రీ కుదిరింది. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించింది. ఏ సినిమాలో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపించింది. కార్తీ, అదితిల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి.

టెక్నికల్ గా కూడా సినిమా తన స్థాయిని ఏ మాత్రం తగ్గించలేదు. సినిమాకు పెద్ద అసెట్ రవివర్మన్ ఫోటోగ్రఫీ. కాశ్మీర్ అందాలను తన కెమెరాలో బంధించిన తీరు అధ్బుతం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. రెహ్మాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా చూస్తున్నంతసేపు మనసును హత్తుకునే విధంగా పాత్రలు, స్క్రీన్ ప్లే ఉంటుంది. మొత్తానికి ఈ సినిమాతో మరోసారి యూత్ పల్స్ ను పట్టుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు మణిరత్నం.
రేటింగ్: 3/5