HomeTelugu Trendingఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన రామ్‌చరణ్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన రామ్‌చరణ్‌

5 7మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచారు. ‘always ram charan’ అన్న పేరుతో ఖాతాను తెరిచిన కొద్దిసేపటికే ఆ ఖాతాను పన్నెండు వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఖాతాకు వెరిఫైడ్‌ అకౌంట్‌ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ సినిమా కోసం మీసం పెంచిన లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి ఫొటోగా పోస్ట్‌ చేశారు. అయితే ఇంకా చెర్రీ ఎవర్నీ ఫాలో అవడం లేదు. ఇప్పటికే ఆయనకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. ట్విటర్‌ ఖాతా లేదు. చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేవన్నీ ఆయన సతీమణి ఉపాసన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. త్వరలో ఆయన ట్విటర్‌ ఖాతాను కూడా తెరుస్తారేమోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu