HomeTelugu Trendingబాలీవుడ్‌ నటుడుపై లైంగిక వేధింపుల కేసు

బాలీవుడ్‌ నటుడుపై లైంగిక వేధింపుల కేసు

4 11
బాలీవుడ్ నటుడు షాబాజ్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఓ యువతిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఏఎన్‌ఐ న్యూస్‌ పేర్కొంది.

ఇక పలు హిందీ సీరియల్‌లో విలన్‌ పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న షాబాజ్‌ ఖాన్‌ అసలు పేరు హైదర్‌ ఖాన్‌. శాస్త్రీయ గాయకుడిగా పద్మభూషన్‌ ఆవార్డును గెలుచుకున్న ఉస్తాద్‌ మీర్‌ ఖాన్‌ కుమారుడు. షాబాజ్‌ తెనాలి రామా, రామా సియా కే లవ్‌ కుష్‌, సలామ్‌ అలీ ఖాన్‌.. వంటి హిందీ సిరియళ్లతో పాటు వెండితెరపై కూడా విలన్‌ పాత్రల్లో నటించి పాపులర్‌ అయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu