HomeTelugu Trendingచిరు '152'వ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర ఇదే.. వైరల్‌

చిరు ‘152’వ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర ఇదే.. వైరల్‌

5 9
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘152’ వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా షూట్ చేస్తున్నారు. 100 రోజుల్లోపుగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు.. అందుకే ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రామ్‌ చరణ్ పాత్ర 40 నిమిషాల వరకు ఉంటుందని అంటున్నారు.

అయితే, చరణ్ పాత్రకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ గా అడవుల్లో చరణ్ చైతన్యం నింపే పాత్రను చేయబోతున్నారట. ఈ సినిమా కోసం చరణ్ 30 రోజుల కాల్షీట్ ఇచ్చారని, ఏప్రిల్ నుంచి చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu