HomeTelugu Big Stories'భోళా శంకర్‌' ట్రైలర్‌ విడుదల చేయనున్న రామ్‌చరణ్‌

‘భోళా శంకర్‌’ ట్రైలర్‌ విడుదల చేయనున్న రామ్‌చరణ్‌

ram charan releasing bholaa
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. ఆగస్ట్ 11 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నారు.

రేపు సాయంత్రం 04:05 గంటలకు డిజిటల్ గా రిలీజ్ చేయనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu