‘డిజె’ భామ అసలు తగ్గట్లేదుగా!

అప్పటివరకు పెద్దగా క్రేజ్ లేని పూజాహెగ్డే కెరీర్ ‘డిజె’ ఒక్క సినిమా మార్చేసింది. ఈ సినిమా వల్ల ఎవరికి ఒరిగిందో.. లేదో.. గానీ పూజాకు మాత్రం డిజె బాగా కలిసొచ్చింది. అప్పటివరకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ డబుల్ చేసెసింది. పోనీ అక్కడితో ఏమైనా ఆగిందా..? అంటే లేదు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన యజమానులకు కళ్ళు చెదిరే పారితోషికం చెప్పి షాక్ ఇచ్చింది. సాధారణంగా షాప్ ఓపెనింగ్స్ కు స్టార్ హీరోయిన్లు మూడు లక్షల నుండి 5 లక్షల వరకు డబ్బు తీసుకుంటారు. లేదంటే ఖరీదైన గిఫ్టులు పుచ్చుకుంటారు.
కానీ పూజా మాత్రం ఏకంగా 10 లక్షలు డిమాండ్ చేసి వారి నోటి నుండి మరో మాట రాకుండా చేసింది. షాప్ ఓపెనింగ్ అంటే మహా అయితే రిబ్బన్ కటింగ్ చేసి ఓ రెండు, మూడు చీరలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే.. ఓ అరగంట పనికి పూజా అంత మొత్తం డిమాండ్ చేయడం చర్చనీయాంశమయింది. కనీసం ఆమెను డబ్బు తగ్గించుకోమని అడగడం కూడా ఇష్టం లేని యజమానులు అక్కడ నుండి వెళ్లిపోయారట. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే విషయం పూజాకు తొందరగానే తట్టింది. ఇక ముందు ముందు ఇంకెన్ని షాకులు ఇవ్వబోతుందో ఈ బ్యూటీ.