తను నటించే ప్రతి సినిమాలో కొత్త కథాంశం ఉండేలా చూసుకుంటాడు నారా రోహిత్. ప్రతినిధి, అసుర ఇలా దేనికదే
ప్రత్యేకం. ఇటీవలే ‘జ్యో అచ్యుతానంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నారా హీరో మరో తాజాగా చిత్రానికి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈసారి హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడిన సినిమాకు ఓకే చెప్పి మరో వెరైటీ స్టోరీతో
మనముందుకు రానున్నాడు. గతంలో నారా రోహిత్ నటించిన ‘సావిత్రి’ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని
ఈ హారర్ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు విజయదశమి
నాడు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు
‘భీముడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు
తెలియాల్సివుంది.