HomeTelugu Newsపవన్‌ సినిమాలో రామ్‌ చరణ్‌ ఎంట్రీ!

పవన్‌ సినిమాలో రామ్‌ చరణ్‌ ఎంట్రీ!

13 5

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌లో రామ్‌ చరణ్ కనిపించనున్నాడు. హీరోలో స్ఫూర్తిని నింపే పాత్ర అని అంటున్నారు. దాంతో మెగా అభిమానులంతా ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు.

ఇక తాజాగా పవన్ సినిమాలో కూడా రామ్‌ చరణ్ కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్, ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక చిత్రం చేయనున్నాడు. ఆంగ్లేయుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కనిపించే అవకాశం ఉందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఆయన పాత్ర ఎలా ఉండనుంది? ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది అంశాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu