నాగచైతన్యతో రష్మిక మందన్న రొమాన్స్‌!

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని సమంత నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నారు . ఇక తాజాగా ఈ మూవీ లో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’ తో మంచి హిట్‌ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా లో నటిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates