HomeTelugu Trendingఫ్యాన్స్‌ సామాజిక సేవాకార్యక్రమాలు.. వీడియో షేర్‌ చేసిన రామ్‌చరణ్‌

ఫ్యాన్స్‌ సామాజిక సేవాకార్యక్రమాలు.. వీడియో షేర్‌ చేసిన రామ్‌చరణ్‌

Ram charan thanks to fans f
కరోనా విపత్కర పరిస్థితుల్లో తన అభిమానులు చేసిన సామాజిక సేవాకార్యక్రమాల పట్ల టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. మీ అందరి అంకిత భావానికి ధన్యవాదాలు అంటూ ప్రత్యేకంగా ఓ ప్రకటన చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందికి సాయం చేశారని, అభిమానులందరికీ పేరుపేరునా శుభాభినందనలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

” ఫ్యాన్స్‌ ఈ కొవిడ్-19 టైమ్‌ లో ఎంతో కష్టపడి సమాజసేవ చేస్తుండడాన్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సాయపడడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పనిచేశారు” అని కొనియాడారు. ఈ సందర్భంగా అభిమానుల సేవాకార్యక్రమాల ఫొటోలతో కూడిన ఓ వీడియోను కూడా రామ్ చరణ్ పంచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu