HomeTelugu Trendingచిరంజీవి 152వ చిత్రంలో రామ్‌చరణ్‌..

చిరంజీవి 152వ చిత్రంలో రామ్‌చరణ్‌..

3 7
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ‘152’ వ చిత్రం తాజాగా ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నారు. 99 రోజుల్లోగానే సినిమాను పూర్తి చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆలస్యం చెయ్యొద్దని ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపిస్తున్నారని తెలుస్తోంది.

ఇందులో మెగాస్టార్ యంగ్ పాత్ర ఒకటి ఉన్నది. ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu