HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం.. రామ్‌ చరణ్‌ వర్కౌట్లు..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం.. రామ్‌ చరణ్‌ వర్కౌట్లు..

6 10
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌.. నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెకక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీంగా తారక్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌పై అరకులో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. త్వరలో రామ్‌చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలను వికారాబాద్‌లోని అడవుల్లో చిత్రీకరించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

రామ్‌చరణ్‌పై పదిరోజులపాటు రాత్రి సమయంలో షూటింగ్‌ నిర్వహించనున్నారట. ఇదిలా ఉండగా సీతారామరాజు పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. ఆదివారం పూట కూడా జిమ్‌లో చెర్రీ సాధన చేస్తున్నారు. సెలబ్రెటీ ట్రైనర్‌ రాకేశ్‌ ఉడియార్‌ ఆధర్యంలో చెర్రీ శిక్షణ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చరణ్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా ఆమె కనిపించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా నటించనున్నారు. విలన్‌గా హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్‌స్టన్‌ అలాగే మరో నటి ఎలిసన్‌ డూడీ నటించనున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ 70 శాతం పూర్తయ్యిందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu