HomeTelugu Trendingగల్లీరౌడీ: 'విశాఖపట్నంలో రౌడీ గాడు' సాంగ్‌ విడుదల

గల్లీరౌడీ: ‘విశాఖపట్నంలో రౌడీ గాడు’ సాంగ్‌ విడుదల

visakhapatnam lo rowdy gaad
హీరో సందీప్‌ కిషన్‌, నేహా హరిరాజ్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పాట విడుదలైంది. ‘విశాఖపట్నంలో రౌడీ గాడు.. షర్టు బటనిప్పాడు ఓ మై గాడు’ అంటూ సాగే ఈ పాటను హీరో నితిన్‌ విడుదల చేశారు. ఈ పాటను యాజిన్ నాజర్ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. సాంగ్ తో పాటు సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. బాబీ సింహా విలన్‌గా నటిస్తున్నాడు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ, కోనా వెంకట్‌ నిర్మాతలు, పోసాని కృష్ణ మురళీ, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సాయి కార్తీక్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu