HomeTelugu Trendingకేసీఆర్ బయోపిక్ త్వరలో తీస్తా: వర్మ

కేసీఆర్ బయోపిక్ త్వరలో తీస్తా: వర్మ

rgv
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం డేంజరస్ అనే మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ బయోపిక్ సినిమా త్వరలో తీస్తాను. ఇప్పటికే బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్టు రెడీ గా ఉంది. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతాను’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ బయోపిక్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

అల్లు అర్జున్‌, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

Recent Articles English

Gallery

Recent Articles Telugu