HomeTelugu Trendingఅల్లు అర్జున్‌, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

అల్లు అర్జున్‌, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

Koratala multi starrer movi

టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలు ..ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో క్రేజీ కాంబోను రాజమౌళి బాక్సాఫీస్ కు పరిచయం చేశారు. దానికి థియేటర్లలో ఓ స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ లు కలిసి సినిమా చేయబోతున్నారన్న హాట్ హాట్ చర్చ సాగుతోంది.

ఆ ఇద్దరినీ కొరటాల శివ ఒకే స్క్రీన్ లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. తారక్ సినిమా పూర్తవ్వగానే.. బన్నీ, ధనుష్ లతో సినిమాను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. ఒకవేళ ఈ కాంబోగానీ ఓకే అయితే అభిమానులకు పండగే మరి!!

కన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

Recent Articles English

Gallery

Recent Articles Telugu