HomeTelugu Big StoriesRam Gopal Varma: చిరంజీవికి పద్మ విభూషన్‌ సంతోషంగా లేను.. కానీ నటిస్తా: రామ్‌ గోపాల్‌ వర్మ

Ram Gopal Varma: చిరంజీవికి పద్మ విభూషన్‌ సంతోషంగా లేను.. కానీ నటిస్తా: రామ్‌ గోపాల్‌ వర్మ

Ram Gopal Varma comments on

Ram Gopal Varma: వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైల్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన రూటే సెపరేటు. ఏ విషయంపైన అయిన కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన పద్మ విభూషణ్ అవార్డులపై స్పందించారు.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితరులను పద్మ విభూషణ్ పురస్కారాలు వరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ, సినీ ప్రముఖలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఆర్జీవీ కూడా తన స్టైల్‌లో ట్వీట్టర్‌ వేదికగా స్పందిస్తూ… పద్మ విభూషణ్ పురస్కారాలపై పెదవి విరిచారు. పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాథక్ వంటి వాళ్ల గురించి తాను ఎప్పుడూ వినలేదు.

వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదని అన్నారు. ఒకవేళ చిరంజీవి గారు ఈ విషయంలో సంతోషంగా ఉంటే… తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా వర్మపై మండిపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu